శాన్ ఫ్రాన్సిస్కొ : శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ ప్రధాన కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఏ కారణం లేకుండానే ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడమేంటని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సెలవుపై పంపిన ఇద్దరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గూగుల్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన